జనం న్యూస్ 02 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:
రాష్ట్రంలోని హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులు కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బోర్డు సభ్యుడు భీశెట్టి బాబ్జీ గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ని కోరారు. డిసెంబర్ ఒకటవ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మంత్రిని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందచేసిన అనంతరం భీశెట్టి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు లక్ష మంది హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులు సాధారణ పింఛను కోసం ఎదురు చూస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తరాంధ్రలో సుమారు 35 వేల మంది హెచ్ఐవి బాధితులు ఉన్నారని, యువతి యువకులకు కూడా అధిక స్థాయిలో హెచ్ఐవికి లోనై ఆందోళన కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని 12 వేలమందికి మాత్రమే సాధారణ పింఛను అందిస్తోందని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాలోనే ఎక్కువమంది బాధితులు ఉన్నారని, హెచ్ఐవి, ఎయిడ్స్ బాధితులకు మంచి ఆరోగ్యకరమైన పౌష్టికాహారం ఉండగానే గాని ఆరోగ్యంగా జీవించలేరని అందుకు ప్రతి ఒక్క బాధితులకు 10 వేల రూపాయలు దీర్ఘకాలిక పింఛను ప్రతిఒక్క బాధితుడికి ఇవ్వాలని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి లోక్ సభ నుండి లేఖ రాసామని మంత్రి సంధ్యారాణి ని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరామని మంత్రి సానుకూలంగా స్పందించారని భీశెట్టి తెలిపారు. ఈ సమావేశంలో మాతృభూమి సేవాసంఘం కార్యదర్శి ఇప్పిలివలస గోపాలరావు, పసుమర్తి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


