(జనం న్యూస్ 2 నవంబర్ ప్రతినిధి కాసిపేట రవి )
ఇటీవల మరణించిన తమ స్నేహితుడు కాల్వ రాజన్న కుటుంబానికి సోమవారం రోజున సాయం చేయాలని ముందుకొచ్చిన మిత్రబృందం ఆదర్శంగా నిలిచింది. కాల్వ రాజన్న మరణం కుటుంబాన్ని తీవ్ర ఆర్థిక కష్టాల్లోకి నెట్టివేయడంతో, స్థానికంగా ఉన్న స్నేహితులు స్వచ్ఛందంగా నిధులు సేకరించి పదివేల రూపాయలు కుటుంబ సభ్యులకు అందించారు.స్నేహం అనేది కేవలం కలిసి తిరగడమే కాదు, సమస్యల సమయంలో తోడుంటేనే నిజమైన విలువ తెలుస్తుందని వారు పేర్కొన్నారు. ఈ చర్య గ్రామంలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. మిత్రబృందం సేవాభావాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో, శంకర్, సుజాత మంజుల,భారతి, రాధిక, సిరిపురం రవీందర్, లశెట్టి శ్రీనివాస్ ఎడ్ల శ్రీనివాస్, కాసిపేట రవి, తదితరులు పాల్గొన్నారు,



