Listen to this article

▪️ఆర్ ఆర్ టోర్నమెంట్ (సీఎం కప్) ప్రారంభించిన వొడితల ప్రణవ్..

జనం న్యూస్ //ఫిబ్రవరి //3//జమ్మికుంట //కుమార్ యాదవ్..
క్రీడలతోనే శారీరక మానసిక ప్రశాంతత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆర్ ఆర్ క్రికెట్ టోర్నీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటల పోటీలను ప్రణవ్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్న ప్రణవ్ టాస్ వేసి ఆటలను ప్రారంభించారు . ఈ సందర్భంగా క్రీడాకారులతో కాసేపు క్రికెట్ ఆడిన ప్రణవ్,ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ఇంటర్నెట్ కు దూరంగా మైదానానికి దగ్గరగా ఉంటే ఆరోగ్యం బాగుంటుందన్నారు.ఆరోగ్యం బాగుంటే ఏదైనా సాధించవచ్చునని క్రీడలను తాను ఎప్పుడు ప్రోత్సహిస్తానని క్రీడల పట్ల తనకు మక్కువ ఎక్కువగా అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఆర్.కప్ నిర్వాహకులు రాజు,సతీష్,జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ నాయకులు, సాయిని రవి, గుడెపు సరంగ పాణి, పూదరి రేణుకా శివ గౌడ్ ,మార్కెట్ వైస్ చైర్మన్ ఏర్రం సతీష్ రెడ్డి, దొడ్డే సదానందం, అనిల్,తో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.