జుక్కల్ డిసెంబర్ 2 జనం న్యూస్కామారెడ్డి జిల్లా
జుక్కల్ నియోజకవర్గం పిట్లం కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కుమ్మరి శేఖర్ నామినేషన్ దాఖలు చేశారు.ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలు, నాయకులతో కలిసి భారీ ర్యాలీగా గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు..ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, అభిమానుల కోలాహలం, ఉత్సాహం చూస్తుంటే.. ఇది నామినేషన్ ర్యాలీలా లేదు విజయోత్సవ ర్యాలీలా ఉందని అభిప్రాయపడ్డారు..కుమ్మరి శేఖర్ గెలుపు ఖరారు అయినట్లే అని చెప్పారు..కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులకు ప్రచార అస్త్రాలు అని.. ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించడానికి సిద్దంగా ఉన్నారని అన్నారు.నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు..




