.జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరుమండలంలోనినాగిరెడ్డిపల్లె మేజర్,గ్రామ పంచాయతీ పరిధిలో గల అరవపల్లెలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ క్రీడ మైదానం నందు పిచ్చి మొక్కలు మొలచి విష సర్పాలు చేరేందుకు అవకాశం ఉందని పందులు పిచ్చి మొక్కలతో దుర్వాసన వస్తుందని,వీటిని తొలగించి ప్రధాన ద్వారం దగ్గర రోలింగ్ గేట్ ని ఏర్పాటు చేయాలని స్వర్ణాంధ్ర మదర్ ల్యాండ్ విక్టరీ స్కౌట్ గ్రూప్ అధ్యక్షుడు వేపగుంట సామ్రాజ్,ఎంపీపీ,మేడ విజయభాస్కర్ రెడ్డి కి వినతిపత్రంఅందజేశారు ,అందుకు ఆయనసానుకూలంగా స్పందించి త్వరలోనే రౌండ్ గేట్ ఏర్పాటు చేస్తామని తెలిపినట్లు వేపగుంట సామ్రాజ్ తెలిపారు



