Listen to this article

మండల వ్యవసాయ అధికారి హరీష్ పవర్,

జనం న్యూస్,డిసెంబర్ 02,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్,జంమ్గి,క్లస్టర్ లోని రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో వరి కొయ్యలను కాల్చొద్దని మండల వ్యవసాయ అధికారి హరీష్ పవార్ రైతులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ క్షేత్రంలో కూలీల కొరత ఏర్పడుతున్నందున రైతులు వరి కోత యంత్రాలను, ఆల్వేస్టార్లను, వినియోగిస్తుండడంతో గడ్డి వినియోగం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. దీంతో పశుసంపదకు గడ్డిని సేకరించకుండా వదిలేస్తున్నారని అన్నారు.గడ్డిని కాల్చి వేయడం సరైన పద్ధతి కాదన్నారు. గడ్డి కాల్చి వేయడంతో నేలకు, పంటకు,మేలు చేసే సూక్ష్మ జీవులకు ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొంటుందని రైతన్నలకు సూచించారు.నెలలో కలియ,దున్నాలి,వల్ల నేల సారం పెరిగి తరువాత పంటలకు బలం చేకూరుతుందని తెలియ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ హనుమడ్లు,పొగాకుల విట్టల్,నారా గౌడ్, వీరేశం,తుకారం, రాములు,రైతులు తదితరులు పాల్గొన్నారు.