జనం న్యూస్, తేదీ.2-12-2025. భద్రాది కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం నాగారం.రిపోర్టర్ బాలాజీ.
కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న మాజీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ కొత్వాల
పాల్వంచ మండలం పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ లు బానోత్ రాజా,బానోతు మంగమ్మ బిఆర్ఎస్ పార్టీ కి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరారు.మంగళవారం నాగారంలో జరిగిన కార్యక్రమంలో *రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డి సి ఎం ఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు.గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ కే సాధ్యం-కొత్వాల
తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అని కొత్వాల అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినాయకత్వంలో రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు చేపడుతున్నారని అన్నారు.సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేలా చూడాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ మాజీ జడ్పిటిసి ఎర్రం శెట్టి ముత్తయ్య,మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న,సొసైటీ మాజీ డైరెక్టర్ చౌగాని పాపారావు, కాంగ్రెస్ నాయకులు వీసంశెట్టి శ్రీనివాసరావు,ముత్యాల మంగయ్య,జలగం హనుమంతయ్య,జలగం బాబురావు,మెంటం రాము,జలగం ఈశ్వరయ్య,సుధాకర్,చౌగాని నాగేశ్వరరావు,బానోతు వినయ్, బానోతు ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.



