Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాల చరిత్ర కలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలోని శబరిగిరీసుడు అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహానికి వినాయకునికి కుమారస్వామికి పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పంచామృతాలతో దేవాలయ చైర్మన్ గురుస్వామి సామల బిక్షపతి ఆధ్వర్యంలో మాల ధరించిన అయ్యప్ప స్వాములు అభిషేకం నిర్వహించినారు. అర్చకులు ఆరుట్ల కృష్ణమాచారి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసినారు. ఈ కార్యక్రమంలో కందగట్ల రమేష్ మార్త సుమన్ గట్టు కిషన్ లోకబోయిన కుమారస్వామి బాసని బాలకృష్ణ కొత్తపెళ్లి రవీందర్ సామల నాగరాజు వనం విశాల్ కోమటిరవి కమల్ ఉజ్జేతుల శ్రీకాంత్ ముల్కనూరి సంజయ్ భక్తులు తదితరులు పాల్గొన్నారు…..