Listen to this article

జనం న్యూస్ డిసెంబర్(3) సూర్యాపేట జిల్లా

తుంగతుర్తి నియోజకవర్గ మద్దిరాల మండలం గుట్ట కింది తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా బానోత్ రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ పదవికి నలుగురు నామినేషన్లు దాఖలు చేయగా బుధవారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతులు కల్పించి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తానని హామీ ఇచ్చారు.