Listen to this article

జనం న్యూస్ డిసెంబర్(3) సూర్యాపేట జిల్లా

తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో బుధవారం నాడు తెలంగాణ మలిదశ అమరుడు శ్రీకాంతచారి వర్ధంతిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మద్దిరాల మండల అధ్యక్షుడు దుగ్యాల రవీందర్రావు మాట్లాడుతూ 2009 కెసిఆర్ అమర నిరాహార దీక్ష చేస్తుంటే అతనిని పోలీసులు అడ్డగించి నిహార దీక్ష చేయకుండా అరెస్టు చేయడంతో డిసెంబర్ 3న శ్రీకాంత్ చారి తెలంగాణ రాష్ట్రం కోసం హైదరాబాదులోని ఎల్బీనగర్ చౌరస్తాలో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మ బలిదానం చేసుకోవడంతో తెలంగాణ ప్రజలంతా ఏకమై స్వరాజ్యం కోసం ముందుకు వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముందుకు వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ మండల ఉపాధ్యక్షుడు తోనుకునూరి అశోక్ మాజీ ఎంపిటిసి సిరంశెట్టి వెంకన్న, బయ్య లింగయ్య, శ్రీను, నాగరాజు, ప్రజలు, విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.