Listen to this article

జనం న్యూస్, డిసెంబర్ 03,అచ్యుతాపురం:

దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో లోగల ఇంటిగ్రేటెడ్ దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ పట్నాయక్ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురం మండలంలో గల ఎస్టిబిఎల్ లో గల ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ నివాసంలో ఇంటిగ్రేటెడ్ దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపాల్ పట్నాయక్ దివ్యాంగుల సమస్యలపై వినతి పత్రాన్ని ఎమ్మెల్యేకి అందజేశారు.వినతిపత్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే స్పందించి పాఠశాల ప్రహరీ గోడను సిఎస్ఆర్ నిధులతో నిర్మిస్తానని హామీ ఇచ్చారు. అలాగే దివ్యాంగుల,వికలాంగుల కోసం తాను అసెంబ్లీలో మాట్లాడి ఆటిజం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.