బిచ్కుంద డిసెంబర్ 3 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
బిచ్కుంద మండల కేంద్రంలోని భవిత కేంద్రం దత్తనగర్ పాఠశాలలో మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగ దినోత్సవమును ఘనంగా నిర్వహించడం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఆట పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది అలాగే దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులకు వివిధ రకాల వైకల్యాలపై అవగాహన కల్పించి దివ్యాంగ విద్యార్థులకు ఉపయోగపడే సర్వీస్ మరియు బెనిఫిట్స్ లను గూర్చి విపులంగా తెలియజేయడం జరిగింది… కేంద్రంలోని వివిధ పాఠశాలలోని దివ్యాంగ ఉపాధ్యాయులు LFL HM సంగమేశ్వర్, సాయిలు కు ఘనంగా సన్మానించడం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మరియు బిచ్కుంద కాంప్లెక్స్ HM దత్తా గౌడ్ కార్యక్రమాని ఉద్దేశించి ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో దత్తనగర్ స్కూల్ ప్రధానోపాధ్యాయులు గంగారం మరియు అభిషేక్ సర్ ప్రత్యేక ఉపాధ్యాయులు రాథోడ్ బలరాం మరియు IERP రాణి మేడమ్ మరియు వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హన్మంతరావు,ఆంజనేయులు,CRP’S ప్రమోద్ , గోపాల్, సుధాకర్ లు మరియు MRC బృందం యోగేశ్వర్ సార్ మరియు పవన్ సార్ పాల్గొన్నారు




