Listen to this article

గుడిపల్లి మండలం లోని భీమనపల్లి గ్రామానికి చెందిన శ్రావణి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్ధి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ శ్రావణి శ్రీనివాసరెడ్డి నీ అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని ఎమ్మెల్యే బాలునాయక్ చెప్పాడు.కసిరెడ్డి శ్రావణి శ్రీనివాసరెడ్డి గ్రామము లోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం లో చురుకుగా పాల్గొంటూ అందరి తో కలవిడగా ఉంటూ ప్రజా సేవ చేస్తుంది. భర్త శ్రీనివాసరెడ్డి మండల కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉంటూ పలు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన పథకాల గురించి పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకి సేవచేస్తూ ప్రతి ఒక్కరికి అండగా ఉంటున్నాడు. రిజర్వేషన్ జనరల్ మహిళా రావడం తో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా ప్రకటించారు. గ్రామ ప్రజా సేవ నే ద్యేయంగా పని చేస్తానని ప్రజల సమస్యలు తీర్చుతానని గ్రామ పంచాయతీ అభివృద్ధి పథం లో గ్రామాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని తనని అత్యదికా మెజార్టీ తో గెలిపించాలని శ్రావణి వేడుకొంది.