

జనం న్యూస్ ఫిబ్రవరి 3 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
కార్పొరేటర్ మాట్లాడుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద డివిజన్లో ఇందిరమ్మ ఇండ్లు సర్వేలో భాగంగా వార్డ్ ఆఫీసులో ప్రజా పాలనలో అప్లై చేసుకున్న సర్వే లిస్టులో రానివారికి, మరియు కొత్త దరఖాస్తుల స్వీకరణ పనులను పరిశీలించడం జరిగిందని గతంలో ప్రజాపాలన ఆరు గ్యారంటీల దరఖాస్తులు స్వీకరించి అందులో నలబై శాతం మాత్రమే ఎంట్రీలు చేశారని ఎంట్రీలు అయిన వాటిలో కూడా కేవలం ఒక్క పథకం మాత్రమే అందుకుంటున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారని కొత్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నప్పటికీ కేవలం ఇందిరమ్మ ఇండ్లకు మాత్రమే స్వీకరించడం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఆరు గ్యారంటీలు అని చెప్తున్నారు వాటికి కూడా స్వీకరించాలని ఇప్పటివరకు చేసిన ఇందిరమ్మ ఇండ్లు సర్వే కేవలం వెరిఫికేషన్ మాత్రమే కాబట్టి వారికి ఇండ్లు ఎప్పటి వరకు ఇస్తారు ఎక్కడ ఇస్తారు ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కొత్త రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియని దరఖాస్తుల స్వీకరించట్లేదు ఎప్పుడు స్వీకరిస్తారన్నది స్పష్టత ఇవ్వాలనీ ఇలా ప్రజలను మభ్యపెట్టి వారిని వార్డ్ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇంకా ఎన్ని రోజులు కాలం గడుపుతారు అని ప్రజలకు ఇచ్చిన ఆరు గారెంటీలు అమలు చేయకపోతే ప్రజల తరఫున అమలు చేసే వరకు పోరాడుతామని అన్నారు.