Listen to this article

,,తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ డిసెంబర్ 3,,

డిసెంబర్ 8–9 తేదీలలో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025″కు కావాల్సిందిగా ఖర్గేకు సాదరంగా ఆహ్వానించారు.తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విజన్‌, భవిష్యత్తు ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయడానికి గ్లోబల్ సమ్మిట్ ఒక కీలక వేదికగా నిలవనుంది. రాష్ట్రంలో చేపట్టనున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు, దీర్ఘకాలిక లక్ష్యాలతో కూడిన “తెలంగాణ రైజింగ్ 2047” రోడ్‌మ్యాప్‌ను కూడా గ్లోబల్ సమ్మిట్ వేదికపై ఆవిష్కరించనున్నారు.ఖర్గే తో సమావేశంలో ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, పలువురు పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.