పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 3 శర్వాస్ వలి మండల రిపోర్టర్
యాడికియాడికి మండలం లోని నెంబర్ 4 ప్రాథమిక పాఠశాల ఆవరణ ము లోని భవిత కేంద్రం నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం గణంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరు ఐన మండల విద్యాధికారి కాసప్ప మాట్లాడుతూ సమాజం లో విభిన్న ప్రతిభావంతులు వారి వారికి ఇష్టమైన రంగాలలో ఇప్పుడు రాణిస్తూ, తమ కాళ్ళ పైన వారు నిలబడి తల్లిదండ్రులకు చేయూత నిస్తున్నారు. కావున వికలాంగుల పిల్లల పేర్లు ను తప్పకుండా భవిత సెంటర్ నమోదు చేయాలని చెప్పారు. పిల్లల కు ప్రభుత్వం ద్వారా తగిన అలవెన్సులు వస్తాయి.యాడికి హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సీతారామాంజనేయులు మాట్లాడుతూ భవిత కేంద్రం లోని మానసిక వికలాంగుల పిల్లల కు వారి అవసరాలకు అనుగుణంగా సాధారణ విద్యార్థులు వారికి అవసరం ఉన్నప్పుడు సహాయం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా పిల్లల చేత కేకు కట్ చేపించి, పిల్లల అందరికీ బహుమతి అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి కాసప్ప, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సీతారామాంజనేయులు, వికళాంగులఉపాద్యాయులు రంగస్వామి రెడ్డి,, ఇంతియాజ్ , నాగలక్ష్మి,, చంద్రశేఖర్, రవీంద్ర, శైలజకుమారి, వరలక్ష్మి, పద్మావతి, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు




