

ప్రాజెక్టు రామడుగు పట్టా భూముల సమస్యలను విస్మరిస్తే తగినబుద్దిచెప్తాం సిపిఐ(ఎం-ఎల్)మాస్ లైన్ రాష్ట్రనాయకులు పి. రామకృష్ణ డిమాండ్.ప్రాజెక్టు రామడుగు పట్టా భూముల సమస్యలపై ఆందోళనలను ఉధృతంచేస్తాం అని, ప్రాజెక్టు రామడుగు పట్టా భూముల సమస్యలను విస్మరిస్తే తగినబుద్దిచెప్తాం అని
సిపిఐ(ఎం-ఎల్) మాస్ లైన్ రాష్ట్రనాయకులు పి. రామకృష్ణ.ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం నాడు ధర్పల్లి మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు: ప్రాజెక్టు రామడుగు పట్టా భూముల సమస్యలపై అనేక దపాలుగా వినతి పత్రాలు ఇవ్వడం, ఆందోళనలు చేపట్టామని అయినా ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లుగా వ్యవహారం ఉందన్నారు. 2005లో 250 మందికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు ఇచ్చిందని అన్నారు. కొందరికి డిజిటల్ పాస్ బుక్ లు వచ్చాయని, బ్యాంక్ రుణాలు పొందడం జరిగింది అన్నారు. ప్రభుత్వం సి.ఎల్.డి.పి. కింద నిధులు మంజూరు చేసి భూమి అభివృద్ధి పనులు సైతం చేశారన్నారు. ఇట్టి రెవిన్యూ భూముల విషయం ఫారెస్ట్ అధికారులతో సమస్య లేకుండా పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసిన చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉందన్నారు. మండల స్థాయి,జిల్లా స్థాయి అధికారులకు అనేక సార్లు విజ్ఞప్తి చెసిన పట్టించుకోవడం లేదు అన్నారు.ఇప్పుడు లబ్ధిదారులు అంత తమ భూములు తమవేనని ఇట్టిభూమాలను చదును చేసుకుంటే, దున్నుకుంటే అధికారులు అడ్డుకోవడం మానుకోవాలి అన్నారు. సిరికొండ 532 సర్వేనెంబర్ లో 200 మందికి పట్టాలు ఇచ్చారని, హై కోర్టు కూడా లబ్దిదారులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన పారేస్ట్ అధికారులు అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. ప్రభుత్వం ఇప్పటికి అయినా ఈరెండు మండలాల రెవిన్యూ భూమిల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.అలాగే ధర్పల్లి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తి అయినా డబుల్ బెడ్రూములను వెంటనే పేదలకు ఇవ్వాలని లేదంటే పేదలు ఆక్రమించుకుంటారనీ ఆయన ప్రకటించారు. నిర్మాణం పూర్తి అయ్యాక పంపిణీ చేయకుండా ఎందుకు ఉంటున్నారు అని ఆయన ప్రశ్నించారు. ఇలానే ఉంచితే ఈ డబుల్ బెడ్ రూమ్ లు సితిలావస్థకు చేరుకునే ప్రమాదం ఉంది అన్నారు. డబుల్ బెడ్ రూములు పంపిణీనీ వెంటనే చేయకుంటే పేదలే ఆ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకుంటారు అని ఆయన హేచ్చరించారు.కార్యక్రమంలో సిపిఐ(ఎం-ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, ఎం. సాయరెడ్డి, ధర్పల్లి మండల నాయకులు ఆశన్న లు పాల్గొన్నారు.