జనం న్యూస్ డిసెంబర్ 3 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్
బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి పంచాయతీ పరిధిలో రైతన్న నీకోసం కార్యక్రమం లో సర్పంచ్ గొలకోటి దొరబాబు మాట్లాడుతూ దీని ముఖ్య ఉదేశ్యం “ప్రకృతి వ్యవసాయం ” చాలా అవసరం అని ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల వాడకం పెంచాలని అలాగే పంట మార్పిడి జరగాలని ఎప్పుడు వరి కాకుండా ఇతర పంటలు వేయాలని కొబ్బరి తోటల్లో అంతర పంటల కింద పోక, అరటి, కోకో పంటలు వేసి అధిక లాభం పొందాలని అలాగే గతంలో మెట్ట భూములు చాలా తక్కువ రేటు ఉండేవాని కోనసీమ వ్యవసాయ భూములు అధిక రేట్లు ఉండేవని ఈరోజు మేట్ట భూములు అన్ని పంటలు సాగు చేయడం వల్ల ఆ భూములు అధిక రేట్లు పలుకుతున్నాయని రైతులు అందరికి తెలియజేయండం జరిగింది ఈ కార్యక్రమం నికి యాళ్ల ఉదయ్, పాము హేమ కుమారి, గోలకోటి భాస్కర్, గోలకోటి తాతాజీ,గోలకోటి కాశీ, సఖిలే వెంకటేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ ఇందు మతి కృష్ణ వేణి మరియు వ్యవసాయం శాఖ నుండి ఏ డి ఏ గౌతమ్ వి ఏ ఏ ,ఏ హెచ్ ఏ, అలాగే రైతులు పలుగున్నారు


