జనం న్యూస్ 04 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
ఎలాంటి వేలం పాట లేకుండా ఐక్యమత్యంతో సర్పంచ్ గా – ఎన్నుకున్న బిజ్వారం గ్రామ ప్రజలు. బిజ్వారం గ్రామ ప్రజల ఐక్యమత్యం – తెలుగు రాష్ట్రాలకే ఆదర్శం మల్దకల్ మండలం బిజ్వారం గ్రామంలో స్థానిక సంస్థ ఎన్నికలలో గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా సీనియర్ నాయకులు వై.శ్రీనివాస్ రెడ్డి సతీమణి వై.శైలజారెడ్డి ని సర్పంచ్ గా బిజ్వారం గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకొని రికార్డ్ సృష్టించి తెలుగు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు.ఇప్పటివరకు సర్పంచ్ అభ్యర్థి వై.శైలజా రెడ్డి నుండి ఎలాంటి వేలంపాట లేకుండా,డబ్బుని,మందు ని పంచనివ్వకుండా ఐక్యమత్యంతో వై.శైలజా రెడ్డిని సర్పంచ్ గా ఎన్నుకొని ఆదర్శంగా నిలిచారు బిజ్వారం గ్రామ ప్రజలు.గ్రామ ప్రజల ఐకమత్యానికి మరెన్నో గ్రామాల ప్రజలు ఫిదా అవుతూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఇదంతా కూడా సీనియర్ నాయకులు వై.శ్రీనివాస్ రెడ్డి సతీమణి శైలజా రెడ్డి మంచితనానికి మానవత హృద యాన్ని గుర్తించి సర్పంచ్ గా ఏకగ్రీవంగా


