Listen to this article

పాపన్నపేట డిసెంబర్ డిసెంబర్03(జనంన్యూస్):

నల్గొండ జిల్లా పద్మశాలి ముద్దు బిడ్డ పున్న కైలాస్ కు డీసీసీ అధ్యక్షపదవినీ అడ్డుకోవాలని చూస్తున్న మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఖబడ్దార్ అంటూ మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు మ్యాకల జయరాములు ఆయన్ను హెచ్చరించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ పద్మశాలి బిడ్డలను రాజకీయంగా ఎదగకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని హెడ్డేవా చేశారు.మంత్రి కోమటి రెడ్డివెంటనే బీసీలకు క్షమాపణలు చెప్పాలన్నారు. బిసిలు లేనిదే నువ్వు మంత్రివి అయ్యావా అని ప్రశ్నించారు.మెదక్ జిల్లా వ్యాప్తంగా పద్మశాలి సంఘాల ఆధ్వర్యంలో మంత్రిని నిలదీయాలని,ఆయన్ను మంత్రి పదవి నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.