Listen to this article

(జనం న్యూస్ 4 డిసెంబర్ ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండలం పరిధిలో సర్పంచ్ పదవి కోసం జరుగుతున్న రాజకీయ పోటీ రోజురోజుకూ ఖరీదైపోతోందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల నిజమైన పారితోషికం నెలకు పది వేల రూపాయలు కూడా రాకపోయినా, ఎన్నికల్లో మాత్రం ఐదు లక్షల వరకు ఖర్చు చేస్తున్నారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రజాసేవ పేరుతో ఇంత భారీ మొత్తాలు వెచ్చించడం పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎన్నికల సమయంలో అభ్యర్థులు ప్రచార ఖర్చులు, వాహనాలు, జనాలను సమీకరించడం, సమావేశాలు నిర్వహించడం వంటి కార్యకలాపాలపై పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.గ్రామ అభివృద్ధి కోసం నిలబడు నాయకులపై ప్రజలకు విశ్వాసం ఉన్నప్పటికీ, రాజకీయం డబ్బు ఆధారంగా నడవడం వల్ల అసలు సేవ తత్వం పెనబడుతోందని పలువురు పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ పదవి పట్ల ఉన్న గౌరవం, సేవాభావం తగ్గిపోకుండా ప్రభుత్వం ఖర్చుల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.