Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 3 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
కాట్రేనికోన ఆర్ అండ్ బి రోడ్డు నుండి కుండలేశ్వరం వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డుకు మహర్దశ పట్టనున్నది. సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు ఆధునికీకరణకు రూ 5 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని ఆర్ అండ్ బి ఏ ఈ ఆశ్రిత తెలిపారు. అదేవిధంగా ఈ రోడ్డు పక్కనే ఉన్న కెనాల్ వెంబడి రక్షణ గోడ, రోడ్డు వెడల్పు నిమిత్తం మరో రూ 15 కోట్లు మేర అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించడం జరిగిందన్నారు. రానున్న పుష్కరాలలోపు ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.