జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా 4/12/2025 గురువారం అల్లాదుర్గ్
మండల పరిధిలో గల గడి పెద్దాపూర్ ధ్వాసాంజనేయ స్వామి ఆలయంలో నాలుగో వార్షికోత్సవ వేడుకలు మరియు దత్త జయంతి వేడుకలు భక్తుల కోలాహలంతో అంబరాన్ని అంటాయి. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి హోమము మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ఆనంద్ శర్మ మాట్లాడుతూ మాఘశిర శుక్లపక్ష పౌర్ణమి తిధిని దత్త జయంతిగా జరుపుకుంటారని, ఈరోజే దత్తాత్రేయ అవతారం ఉద్భవించింది కావున మార్గశిర పౌర్ణమి పవిత్రమైన రోజుగా పరిగణిస్తూ, అత్రి మహాముని, అనసూయ ల సంతానమే దత్తుడిగా ఈయన త్రిమూర్తులు అయిన బ్రహ్మ, విష్ణు,మహేశ్వరుల అంశతో జన్మించిన వరపుత్రుడిగా, దత్త స్వరూపాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టుగా విశ్వసిస్తారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భోజన కార్యక్రమాలను ఏర్పాటు చేయగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజ వేడుకను విజయవంతం చేశారు.



