Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం డిసెంబర్ 4

తర్లుపాడు మండలం లోని ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న కాంప్లెక్స్ రిసోర్స్ మానిటరింగ్ టీచర్లు సి ఆర్ ఎం టి లు తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తర్లుపాడు విద్యాశాఖ అధికారి-2, అచ్యుత్ సుబ్బారావుకు మరియు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ లక్ష్మి రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సి.ఆర్.పి.లు గోసు వెంకటేశ్వర్లు, టి. అచ్యుతరావుల ఆధ్వర్యంలో ఈ వినతిపత్రాన్ని సమర్పించారు.2011లో స్కూల్ అసిస్టెంట్ అర్హతలు (డిగ్రీ, బి.ఎడ్., టెట్) తో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఎంపికై,జి ఓ ఎం ఎస్ నెంబర్.65 ప్రకారం 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న 4034 మంది కాంప్లెక్స్ రిసోర్స్ మానిటరింగ్ టీచర్లు తమ ప్రధాన డిమాండ్లను వినతిపత్రం ద్వారా తెలియజేసారు రాష్ట్ర ప్రభుత్వం సృష్టించిన పోస్టులను ఏ మరియు బి క్లస్టర్ ప్రతిపాదిత విధానాన్ని తక్షణమే విరమించాలి. వీలుకాకపోతే, అందరినీ విలీనమైన క్లస్టర్లలోనే కొనసాగించి, అందరికీ ఒకే విధమైన హోదా, పని అప్పగించాలని,2016లో పి ఏ బి ఆమోదించిన రూ. 23,500/- వేతనాలను గత 9 సంవత్సరాలుగా ఎటువంటి పెంపుదల లేకుండా చెల్లిస్తుండటంతో, పెరిగిన ధరల కారణంగా కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. కావున తక్షణమే వేతనాలు పెంచాలి.స్కూల్ అసిస్టెంట్ అర్హతలతో పనిచేస్తున్న సి ఆర్ యం . టి లకు రాష్ట్ర పి ఆర్ సి అనుసరించి స్కూల్ అసిస్టెంట్ బేసిక్ వేతనం రూ. 44,570/- లతో మెర్జెడ్ టీచర్స్ సిస్టమ్ ను అమలుచేయాలని,విద్యాశాఖలో విలీనం చేసి, తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు,ఆర్ యం టీచర్స్ యునైటెడ్ ఫోరమ్ పిలుపు మేరకు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల డిసెంబర్ 4న మండలంలో, 8న జిల్లా కలెక్టరేట్ల వద్ద, మరియు 22న విజయవాడ నందు ఆత్మగౌరవ దీక్ష చేయనున్నట్లు సి ఆర్ ఎం టి ప్రతినిధులు ఈ సందర్భంగా తెలియజేశారు.