Listen to this article

జనం న్యూస్ 03 ఫిబ్రవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా :- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అధిక నిధులు కేటాయించాలని ధరూర్ మండల సిపిఎం నాయకులు దేవదాసు డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం ధరూర్ మండల కేంద్రంలోని వైయస్సార్ విగ్రహం ముందు బడ్జెట్ ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ప్రతి బడ్జెట్లో నిధులకు కోతలు విధిస్తున్నారని అన్నారు గత సంవత్సరం బడ్జెట్లో 86 వేల కోట్లు కేటాయించగా ఈ సంవత్సరం వాటిని 83 వేల కోట్లకు తగ్గించారని అన్నారు పథకానికి నిదుల కోత పెడితే ఏ విధంగా కూలీలకు ఉపాధి దొరుకుతుందని ప్రశ్నించారు ఇప్పటికే గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేసిన కూలీలకు కూలీలు రాక,పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అటువంటిది ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి బలోపేతం చేయాల్సింది పోయి నిధులు తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం మాటలమో పేద మధ్యతరగతి ప్రజలకు సేవలు మాత్రం పెట్టుబడిదారులు ధనవంతులకు అందిస్తున్నారని విమర్శించారు ధరలు పెరిగి వేతనాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేటి పరిస్థితుల్లో కొద్దో గొప్పో పేదల ఉపాధికి ఉపయోగపడుతున్న ఉపాధి హామీ పథకానికి సైతం నిధులలో కోత విధించడం ఏమిటని ప్రశ్నించారు బడ్జెట్ ను సవరించి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రెండు లక్షల కోట్ల నిధులు కేటాయించి, విద్యా వైద్యం తదితర ప్రజా సంక్షేమ రంగాలకు అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ధరూర్ మండల నాయకులు మేకల నరసింహులు మోష తిమ్మప్ప ప్రవీణ్ వినయ్ నరసింహ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు
ధన్యవాదాలతో
మోషధరూర్ మండల సిపిఎం నాయకులు