మద్నూర్ డిసెంబర్ 4 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం అంతాపూర్ గ్రామపంచాయతీ బి ఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గురువారం అంతాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో బాబు పటేల్ మారుతి ఆధ్వర్యంలో టిఆర్ఎస్ కార్యకర్త దాని వార్ శంకర్ భార్య సంగమ్మ తన నామినేషన్ దాఖలు చేసినారు.
మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిందే ఆదేశాలనుసారం బి ఆర్ఎస్ అభ్యర్థి సంగమ్మ వైఫ్ ఆఫ్ శంకర్ పటేల్ గెలుపు తత్యమని ఈ సందర్భంగా మారుతి అన్నారు. ముందుగా గ్రామస్తులతోని సమావేశమై అందరూ కలిసికట్టుగా పనిచేసే గ్రామ సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కార్యకర్తలను దిశ నిర్దేశం చేసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ నాయకులు విట్టల్ మారుతి కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.


