Listen to this article

జుక్కల్ డిసెంబర్ 4 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప పటేల్ నామినేషన్ ర్యాలీ నాయకులు, కార్యకర్తల కోలాహలం నడుమ ఉత్సాహాభరితంగా సాగింది.._ఈ నామినేషన్ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు..పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు..అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో రహదారులు, నీటి వసతులు, విద్యుత్ మరియు ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి పనులు మరింత వేగంగా సాగుతాయని..
సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు..కాటేపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి శ్రీదేవి మల్లప్ప పటేల్ ని గ్రామ ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించి గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలిపునిచ్చారు..