జనం న్యూస్ 05 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ
పట్నాయక్‌విజయనగరంలోని స్థానిక ప్రభుత్వ బీసీ వసతి గృహంలో ఓ విద్యార్థిని గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మహారాజా కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న స్వాతిగా పోలీసులు గుర్తించారు. ఈమె స్వస్థలం శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మంగా తెలిపారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


