డిసెంబర్ 5 జనం న్యూస్కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం
మద్నూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మరోసారి తమ శక్తి, ఐక్యత, ప్రజాధారాన్ని ఘనంగా చాటుకుంది. జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే అద్భుత నాయకత్వం, మార్గదర్శకత్వంతో బీఆర్ఎస్ తరపున మద్నూర్ సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన రౌతువార్ ఈశ్వరమ్మ నామినేషన్ దాఖలు కార్యక్రమం శుక్రవారం భారీ ఎత్తున నిర్వహించబడింది.ప్రత్యేక ఆకర్షణగా బ్యాండ్ మేళాలు, పెద్ద ఎత్తున టపాకాయలు పేలుస్తూ, మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ కొనసాగింది. వందలాది మంది కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, యువత ర్యాలీలో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థికి తమ అండగానూ, ఐక్యంగానూ నిలబడ్డారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న జుక్కల్ మాజీ శాసనసభ్యులు హన్మంత్ షిండే మాట్లాడుతూ—“మద్నూర్ అభివృద్ధి కోసం బలమైన నాయకత్వం అవసరం. ఆ బాధ్యతను అందుకోగల నాయకురాలు ఈశ్వరమ్మ. గ్రామాభివృద్ధి, సేవ, పారదర్శకత—ఇవన్నీ బీఆర్ఎస్ లక్షణాలు. ప్రజల ఆశీర్వాదంతో మద్నూర్ మరింత ముందుకు సాగుతుంది” అని అన్నారు.తరువాత మద్నూర్ కేంద్రంలో సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు ప్రక్రియను ఘనంగా పూర్తి చేశారు.బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నిండిపోయిన ఈ కార్యక్రమం మద్నూర్ లో ఎన్నికల వాతావరణాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చింది




