Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 5 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులతో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థుల మౌలిక సదుపాయాలు ఉపాధ్యాయులు విద్యార్థులు ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే విధంగా ఏర్పాటు చేసిన జీవీఎంసీ గవరపాలెం హై స్కూల్లో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశానికి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు పాల్గొని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వం విద్యాశాఖ చర్యలు తీసుకోవడం వల్ల పరీక్షలలో ఉత్తీర్ణత శాతం పెరిగి స్కూల్స్ కు మంచి పేరు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా గవరపాలెం స్కూల్లోనే చదివించాలని ఆలోచనకు వస్తున్నారని, క్రమశిక్షణతో కూడిన విద్య వలన విద్యార్థుల భవిష్యత్తు బంగారు బాటగా మారుతుందని, విద్యార్థి స్థాయికి తగ్గట్టుగా ఉపాధ్యాయులు బోధన జరగడంతో మంచి ఫలితాలు సాధిస్తున్నారని, ఉపాధ్యాయుల కొరత లేకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీ నిర్వహించి 16,646 పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగంతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం అవకాశాలు కల్పించిందని, అలాగే విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం, ఉచితంగా స్కూల్ డ్రెస్సు, అసెస్మెంట్స్ బుక్స్ ద్వారా విద్యార్థి విద్యార్థును లు వారి సాధించిన విద్యా ప్రగతిని తల్లిదండ్రులు తెలుసుకునే విధంగా రూపొందించడం జరిగిందని, ఉపాధ్యాయులు కూడా క్రీడల్లో భాగస్వామo చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడం జరుగుతుందని నాగ జగదీష్ అన్నారు. శ్రీ భోగలింగేశ్వర దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ మాట్లాడుతూ తల్లిదండ్రులు విద్యార్థుల యొక్క మనోభావాలు తెలుసుకొని తదు అనుగుణంగా ఉపాధ్యాయులతో మమేకం కావాలని తద్వారా విద్యార్థులు భవిష్యత్తు బాగుంటుందని, ఇష్టంతో చదవడం చాలా మంచిదని, భవిష్యత్తు ప్రణాళికను విద్యార్థులు ఇప్పటి నుండే కృషి చేయాలని జనసేన నాయకులు గవర కార్పొరేషన్ డైరెక్టర్ విల్లూరు హరి అన్నారు. స్కూల్ కమిటీ చైర్మన్ కొణతాల లక్ష్మీ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ మా పిల్లల భవిష్యత్తు కోసం అరణ్యస్థలు కృషి చేసి మమ్మల్ని భాగస్వామ్యం చేయడం మాకు సంతోషాన్ని, మా పిల్లలు చదువులు తెలుసుకోగలుగుతున్నామని లక్ష్మీ అన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్ మహాలక్ష్మి ఉపాధ్యాయులు కాండ్రేగుల జనార్ధన్ సూరిశెట్టి వేణుగోపాల్ కూటమి నాయకులు కాండ్రేగుల జోగేంద్ర దాడి బుజ్జి బుద్ధ జోగినాయుడు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొన్నారు.