Listen to this article

జనం న్యూస్, డిసెంబర్ 5: నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల

మండలంలోని తాళ్ళరాంపూర్ గ్రామంలో సర్పంచ్ పదవికి బెజ్జారపు పావని శుక్రవారం నాడు ఘనంగానామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గ్రామం మొత్తం ఉత్సాహంతో మార్మోగింది.కార్యక్రమం ప్రారంభంలో పావని, విశ్వ బ్రాహ్మణ సంఘం వద్ద వీరబ్రహ్మేంద్ర స్వామి మరియు జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు అర్పించి ఆశీర్వాదాలు పొందారు. అనంతరం ప్రధాన వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో గ్రామం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.స్థానిక ప్రజలు, సంఘ సభ్యులు, నాయకులు, యువత భారీ సంఖ్యలో పాల్గొని నినాదాల మధ్య పావని నామినేషన్ దాఖలు చేశారు.