

జనం న్యూస్ ఫిబ్రవరి 3 మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం చండుర్ గ్రామంలో ఏరువాక కేంద్రం – సంగుపేట్ శాస్త్రవేత్తలు మరియు పంట పొలాలను పరిశీలించడం జరిగింది , ప్రధానంగా ఈ యాసంగిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు మరియు సాగులో పాటించవలసిన మెలకువల గురించి రైతులకు వివరించడం జరిగింది. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం సమన్వయకర్త ( కో-ఆర్డినేటర్) శాస్త్రవేత్త రాహుల్ విశ్వకర్మ మాట్లాడుతూ వరి పొలములో అక్కడక్కడ సల్ఫైడ్ దుష్ప్రభావ లక్షణాలు గమనించడం జరిగింది, ఈ లక్షణాలు గమనించనట్లయితే పొలములో అడుగు పెట్టినపుడు బుడగల రూపంలో నీరు మారి, మొక్కను వేర్లతో బయటకి తీసినప్పుడు క్రుళ్ళిన కోడి గుడ్ల వాసన వచ్చును, ఈ లక్షణాలకు ముఖ్య కారణం కాంప్లెక్సు ఎరువులు ఎక్కువగా వాడటం అలాగే వేర్లకు సరిగ్గా నీరు అందక పోవడం అని చెప్పవచ్చు. సరైన నీటి యాజమాన్యం, మురుగు కాలువల సౌకర్యాన్ని అందించడం ద్వారా ఈ దుష్ప్రభావాలను తగ్గించుకొనవచ్చును. సల్ఫైడ్ దుష్ప్రభావం గమనించడం వెంటనే నీటిని తీసివేసి 1-2 రోజుల దుబ్బుల చుట్టూ మరియు పొలంలోని నేలకు గాలి తగిలేటట్టు చూడాలి . నివారణకు నాటు వేసిన పొలాన్ని అప్పుడప్పుడు ఆరబెడుతు ఉండాలి,సల్ఫైడ్ దుష్ప్రభావ లక్షణాలు వచ్చిన ప్రదేశాలు గుర్తించి తర్వాత వేసే వరి పంటకు ముంది ఆయా ప్రాంతాలలో 2-3 బండ్ల ఎర్ర మట్టిని వేసి నేలలో బాగా కలియబెట్టి దున్నాలి, అలాగే చౌడు అధికంగా ఉన్న నేలలో జింకు సల్ఫేట్ 2 గ్రా. లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి అని అన్నారు. ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త సరిత మాట్లాడుతూ భూమిని ఎత్తు చేసుకోవడం , పంట మధ్య కాలములో పొలాన్ని సన్న నెర్రెలు వచ్చే వరకు ఆరగట్టి అప్పుడప్పుడు మళ్ళీ నీరు ఇవ్వాలి అని రైతులకు వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి కృష్ణవేణి రైతులు పాల్గొన్నారు