Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

గోకవరం మండలం, జి. కొత్తపల్లి గ్రామములో ఆదర్శ ప్రైమరీ & హైస్కూల్ నందు డిసెంబర్ 5 మరియు 6 వ తేదీల్లో వైజ్ఞానిక ప్రదర్శన (సైన్స్ ఫెయిర్ ) జరుపబడుతుందిని హై స్కూల్ హెడ్మాస్టర్ జయ సత్యనారాయణ తెలియజేశారు. విజ్ఞాన ప్రదర్శనలో భూకంపాలు ఈ మధ్య జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలలో భూకంపం ఒకటి, వాటిని తట్టుకొని ఆధునిక పద్ధతిలో నివాసి యోగాలు వ్యాపార సముదాయాలు, రహదారి వ్యవస్థను పటిష్టంగా నిర్మించడానికి రూపొందించిన మోడల్ బాగుందని స్మార్ట్ సిటీ : ప్రపంచంలో అత్యంత అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహిస్తున్న స్మార్ట్ సిటీ నిర్మాణంలో సాంకేతికతో కూడిన రక్షణ కవచంగా నగర నిర్మాణాలు జరగడం వలన ప్రజలకు రవాణా సౌకర్యం లో అవాంతరాలు కలగకుండా నిర్మాణ విధానాన్ని వర్ణించడం అద్భుతం.నిప్పు ద్వారా అతి చౌక విధానంలో విద్యుత్తును తయారు చేయడం ఎంతో ఉపయోగకరమని అన్నారు.మన ప్రాచీన సాంప్రదాయ కలలను నీటి విద్యార్థులు ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా తోలుబొమ్మలాటను ప్రదర్శించడం అభినందిదాయకమని అన్నారు.పొల్యూషన్: నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన ఇబ్బంది కాలుష్యం ఒకప్పటి నగరాల్లో ఉండే కాలుష్యం నేడు పల్లెటూర్లకు రావడం బాధాకరమని నగరాలలో కాలుష్యరీతంగా ఎలా ఉండాలో సవివరంగా వివరించడం జరిగింది ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధి గా మినర్వ ఫౌండర్ శ్రీ డి. వి. యస్. రాజు (రమేష్ ) గారు పాల్గొని, విద్యార్థులచే ప్రదర్శించబడిన ప్రాజెక్టు లను పరిశీలించి విద్యార్థులను అభినందిస్తూ కొన్ని ఉదాహరణగా పైన చెప్పడం జరిగింది. తెలియని విషయాలను తెలుసుకొంటూ వుండాలని, ప్రతి విద్యార్థి ప్రశ్నించే స్వభావం కలిగి వుండాలని, తల్లి తండ్రులు,పెద్దల యందు గౌరవ భావం తో ఉంటూ క్రమశిక్షణ తో మెలగాలని, ప్రతి ఒక్కరు తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తన ప్రసంగం లో తెలియపచ్చారు…గ్రామస్థాయి, గిరిజన ప్రాంతాల విద్యా భి వృద్ధి కోసం ఆదర్శ విద్యా సంస్థలు స్థాపించి, వైద్య విద్యాభివృద్ధి కి ప్రయత్నిస్తూ విద్యార్థుల భవిష్యత్ కు తొడ్పాటు అందిస్తున్న ఆదర్శ చైర్మన్ కనక రాజును ఎంతగానో అభినందించాలి.ఈ విజ్ఞాన సదస్సు లో ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ పి. కనక రాజు , సెక్రటరీ డాక్టర్ నాగమణి డైరెక్టర్ డాక్టర్ ప్రవల్లిక గారు, కో ఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ శ్రీ త్రినాధ్ రావు, ప్రాధనోపాధ్యాయులు శ్రీ సత్యనారాయణ, అధ్యాపక బృందంను అభినందించారు.సుదూర ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థుల తల్లి తండ్రులు, గ్రామస్తులు, ఈ ప్రదర్శన ను తిలకించి, తమ పిల్లల యొక్క ప్రతిభను మెచ్చుకున్నారు.ఈరోజు నుండి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం దిగ్విజయంగా జరుగుచున్నది…