Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 5 చిలిపి చెడు మండల ప్రతినిధి

చిలిపి చెడు మండలంలో ఫైజా బాద్ గ్రామములో ఎఫ్.ఈ.ఓ. పర్టిలైజర్, సీడ్స్ షాప్‌ను శుక్రవారం ఏ.డీ.ఏ.పుణ్యవతి ఆకస్మికంగా తనిఖీ చేశారు .యూరియా, కాంప్లెక్స్ ఎరువుల నిల్వ, అమ్మకాలు ఈ పాస్ యంత్రంలో నమోదు వివరాలు, దుకాణం, గోదాంలోని ఎరువులు, పురుగు మందుల నిల్వలను పరిశీలించారు.ప్రస్తుతం యూరియా, కాంప్లెక్స్ ఎరువులు, పొటాష్ అందుబాటులో ఉన్నట్లు, యూరియాకు ఎలాంటి ఇబ్బంది లేదని దుకాణం యజమాని యం.డి.యాసిన్ వివరించారు.కార్యక్రమములో ఏఈఓ క్రిష్ణవేణి రైతులు పాల్గొన్నారు.