జనం న్యూస్ డిసెంబర్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం.05-12-25 శుక్రవారం మధ్యాహ్నం 3.00 గంటలకు ముమ్మడివరం మండలం తానేలంక గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న బాలిక అదృశ్యంపై మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద మరియు కూటమి నాయకులు ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న బాలికను పరామర్శించినారు. మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద మాట్లాడుతూ ఈరోజు గౌరవ శాసనసభ్యులు బుచ్చిబాబు గారి ఆదేశాల మేరకు ఉమ్మడి కూటమి నాయకులు అందరూ కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని ఒక వ్యక్తి ఒక మహిళ సహాయంతో గురుకుల పాఠశాల సిబ్బందికి మాయ మాటలు చెప్పి బంధువులు అని నమ్మించి బాలికను తీసుకెళ్లిన ఘటనపై కూటమి నాయకులందరూ గురుకుల పాఠశాలకు వెళ్దామని అనుకున్నప్పుడు బాలిక ముమ్మిడివరం గవర్నమెంట్ హాస్పటల్ లో ఉందని తెలుసుకుని గవర్నమెంట్ హాస్పటల్ కు రావడం జరిగింది అని బాలిక చాలా బాధపడుతుంది ,బాలికను హింసించిన వ్యక్తిని ఏ వర్గమైనప్పటికీ ఏ పార్టీ అయినప్పటికీ కఠినంగా శిక్షించాలని అన్నారు, కూటమి నాయకులందరూ కూడా ఇటువంటి వ్యక్తుల్ని శిక్షించాలని, ఇటువంటి వ్యక్తులను ఫోక్సో కేసు ద్వారా కఠినంగా శిక్షించాలని బుచ్చిబాబు చెప్పడం జరిగిందని బుచ్చిబాబు బెంగళూరు వెళ్లడం జరిగిందని వచ్చిన వెంటనే వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి ఏ విధంగా ఏం చేయాలో చేయమని మాకు చెప్పడం జరిగిందని, హాస్పటల్లో బాలికను వాళ్ళ బంధువులను కూడా చూసి చెప్పాము ,ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవరైతే ఈ అఘాయిత్యంచేశాడో అతనిని కఠినంగా శిక్షించాలని అన్ని ఏర్పాట్లు చేశామని బాలికకు న్యాయం జరిగేలా చూస్తామని వివేకనంద అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి గుత్తుల సాయి, చెల్లి అశోక్, గొలకోటి దొరబాబు, పొద్దోకు నారాయణరావు, అర్ధాన్ని శ్రీనివాసరావు, కట్ట సత్తిబాబు, గోదాసి పుండ్రిష్ , బద్రి రమ,యాళ్ల ఉదయ్ , చిక్కాల అంజిబాబు, గొల్లపల్లి గోపి, దంగేటి శ్రీను,కాశి లాజర్ ,కర్రా శ్రీను,కాకి మాణిక్యం , గోదాసి గణేష్ , ఇసుక పట్ల ఈశ్వర్, సురేష్, కుటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



