జనం న్యూస్- డిసెంబర్ 5- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నాగార్జునసాగర్ బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి కోకో పోటీలకు ఎంపికైనట్లుగా ప్రిన్సిపల్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6 7 తేదీలలో సికింద్రాబాద్ వెస్లీ బాయ్స్ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ అండర్ 19 కోకో పోటీలకు తమ పాఠశాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు అనిల్, అఖిల్ పదవ తరగతి విద్యార్థులు బన్నీ, నరేందర్ నల్లగొండ జిల్లా జట్టు తరుపున పాల్గొననున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ రవికుమార్ , వ్యాయామ ఉపాధ్యాయులు జ్యోతి, అరుణ, నరసింహ, ఉపాధ్యాయులు అభినందించారు.


