జనం న్యూస్ 5.కొమురం భీమ్ జిల్లా. జిల్లా. స్టాఫ్ఫర్.
ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అర్మన్ & బ్రదర్స్’ కిరాణా, జనరల్ షాప్ను శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, నియోజకవర్గ ఇంచార్జ్ శ్యామ్ నాయక్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగా ప్రారంభించిన ఈ షాప్ మంచి ఆదరణ పొందాలని, యజమానులకు అభివృద్ధి, మంచి వ్యాపారం కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. యువత స్వయం ఉపాధి రంగంలోకి రావడం అభినందనీయం. కొత్త వ్యాపారాలకు ప్రజలు సహకారం ఇవ్వాలని అన్నారు.యువతకు ఉపాధి కల్పించాటానికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని పేర్కొన్నారు.ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నాయకులు , వ్యాపారవేత్తలు, దుకాణ యజమానుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


