Listen to this article

జనం న్యూస్‌ 06 డిసెంబర్, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఉహించలేరు. విజయనగరం జిల్లాకు చెందిన పలువురు స్వాములు అయ్యప్పకు ఇరుముడి సమర్పించారు. అనంతరం శబరిమల నుంచి కారులో తిరుగుపయనమయ్యారు. రాత్రి ప్రయాణం ప్రమాదమని భావించి రామేశ్వరం వద్ద రోడ్డు పక్కన వాహనం ఆపారు. అందరూ నిద్రలో ఉండగా మృత్యు లారీ కారు మీదకు దూసుకు రావడంతో నలుగురు చనిపోయారు.
వీరి మరణ వార్త విన్న కుటుంబీకులు, గ్రామస్థులు విషాదంలో మునిగారు.