జనం న్యూస్ 06 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
నిన్న భీమిలి నియోజకవర్గం, తగరపువలస మూడు కోవెల దరి అనీల్ నీరుకొండ పోవు రహదారి వద్ద భీమిలి 2 వ వార్డు అధ్యక్షులు చిల్ల భాస్కర రెడ్డి ఆధ్వర్యంలో జరుగు కోటి సంతకాల కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, వైయస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయ కర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ తన తండ్రి ఆదేశాలు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జరుగుతున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం లో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రజల కనీస హక్కు అని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీటిని ప్రజలకు దూరం చేస్తోందని అన్నారు. మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా ఈ కోటి సంతకాల కార్యక్రమం చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి అక్కరమాని మంగరాజు, జిల్లా కార్యదర్శి జీరు వెంకటరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బింగీ హరికిరణ్ రెడ్డి, వార్డు ప్రధాన కార్యదర్శి చిప్పాడ వెంకటేష్, భీమిలి నియోజకవర్గం మహిళ అధ్యక్షురాలు డబ్బీరు ప్రశాంతి, చెట్ల ఎల్లయ్య రెడ్డి, గుండాసి మధు నాయుడు, కదిరి ఏళ్ళజీ, ఆర్.ప్రభాకర్ నాయుడు, చిల్ల సూర్యనారాయణ రెడ్డి, తేడ్లపు అప్పలరాజు, పీతల వెంకట అప్పారావు, సరగడ శివాంజనేయ రెడ్డి, సీరపు శ్రీరాములు, కొయ్య వెంకటలక్ష్మి, ఇంజి వరలక్ష్మి, రామాయమ్మ, నమ్మి సత్తిబాబు, నమ్మి రాము, చిల్ల సూరి నరసయ్య రెడ్డి, సి పే. రెడ్డి, చిల్ల సూరిబాబు, తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీగా పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, స్థానిక ముఖ్య నాయకులు, కార్యకర్తలు, చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షుడు తోట వాసు, చిన్న శ్రీను సోల్జర్స్ సభ్యులు, తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


