జనం న్యూస్ 06 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో గంట్యాడ మండలం చంద్రంపేట గ్రామానికి చెందిన పలువురు వైసీపీకి చెందిన గ్రామ స్థాయి నాయకులు, కార్య కర్తలు శుక్రవారం కొమ్మినేని శివరావు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. కార్యకర్తలకు కష్ట సుఖాలలో అండగా ఉండే ఏకైక పార్టీ టీడీపీ అని మంత్రి అన్నారు. తమపై నమ్మకంతో పార్టీలో చేరినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.


