జనం న్యూస్ 06 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్లో అంబేద్కర్ విగ్రహంనికి పూలమాలవేసి నివాళులర్పించిన కెవిపిఎస్ జోగులాంబ గద్వాల జిల్లాఅధ్యక్షుడుఏపరంజ్యోతి ఆయనమాట్లాడుతూ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ భారతదేశ ప్రజల జీవన విధానాన్నే మార్చేసిన గొప్ప మహనీయుడు భారత రాజ్యాంగం రూపశిల్పి మానవతవాది భారత దేశ ప్రజల హక్కుల ప్రధాత మహిళా హక్కుల కోసం తన కేంద్ర మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసినటువంటి గొప్ప త్యాగశీలి అని అన్నారు, బుద్ధుని జ్యోతిబాపూలే మరియు కబీర్దాస్ యొక్క ఆలోచన విధానంతో ముందుకు నడిచినటువంటి మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అతని యొక్క కృషి ఫలితమే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు వెనుకబడిన వర్గాల అభివృద్ధి కావున భారతరత్న బాబాసాహెబ్ కి దేశం ఎల్లప్పుడు రుణపడి ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాంతినగర్ మల్దకల్/ పైపాడు సత్యరాముడు కోయిలదిన్నె గోకారి మున్సిపాలిటీ సిబ్బంది వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు


