మౌలిక వసతులపై పరిశీలన
జనం న్యూస్ డిసెంబర్ 06 సంగారెడ్డి జిల్లా,
పటాన్చెరు నియోజకవర్గం: క్యాసారం గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థి కైలా అనిత ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని బలపరిచారు. గ్రామంలోని ప్రతి గడపను సందర్శిస్తూ ఓటర్లను అభివందించి, సమస్యలను ఆరాతీస్తూ ప్రచారంలో చురుకుదనాన్ని చూపించారు.గ్రామస్థాయి మౌలిక వసతులపై ఆమె ప్రత్యక్షంగా పరిశీలన చేశారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి సరఫరా వంటి సమస్యలపై గ్రామస్థులతో మాట్లాడి, ఎన్నికల అనంతరం ఈ సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.గ్రామంలో తిరుగుతూ ప్రజలతో సన్నిహితంగా మాట్లాడిన అనిత ప్రభాకర్ రెడ్డి ప్రచారానికి స్థానికులు స్వచ్ఛందంగా చేరి మద్దతు తెలిపారు. పలు ప్రాంతాలలో ఆమెకు ఊరువాసుల నుంచి విశేష స్పందన లభించింది.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామంలోని 10 వార్డుల వార్డ్ సభ్యులు ఆమె వెంట ప్రయాణిస్తూ ప్రచారాన్ని బలోపేతం చేశారు. అలాగే శ్రీనివాస్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, శరణప్ప, మధుసూదన్, మాజీ ఎంపీటీసీ రమేష్, మైలారం మహేశ్వరి, ప్రభాకర్ తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.


