

జనం న్యూస్ ఫిబ్రవరి 3 నడిగూడెం వసంత పంచమిని పురస్కరించుకొని నడిగూడెం శ్రీ సాయి పబ్లిక్ స్కూల్లో చదువుల తల్లి సరస్వతి దేవి చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేసి విద్యార్థులు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయుల, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బుస్సా సులోచన మాట్లాడుతూ వసంత పంచమి రోజున సరస్వతి దేవి పుట్టినరోజును జరుపుకుంటారని తల్లి దీవెనలతో విద్యార్థిని, విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులందరూ సరస్వతి దేవి ప్రార్థన, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వీరయ్య, హర్ష, సైదులు, మందుల రాంబాబు, మల్లిక ,రమ్య, లక్ష్మి, వైదేహి, నాగమణి, రజియా, త్రివేణి ,వీర కుమారి జ్యోతి ,తదితరులు పాల్గొన్నారు