వ్యవసాయాధికారి మృదుల
జనం న్యూస్ డిసెంబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ప్ర
ది.06.12.2025 తేదీన మండల వ్యవసాయాధికారి వారి ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గం కాట్రేనికోన-2 రైతు సేవకేంద్రం నందు రబీ సాగుకు ముందస్తు ప్రణాళిక మరియు సబ్సిడీ పై వరి విత్తనాలు గురుంచి మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వ్యవసాయాధికారి మృదుల మాట్లాడుతూ రబీ సాగుకు ముందస్తుగా రైతులు అందరూ సిద్ధంగా ఉండాలి అని అదేవిధంగా ప్రభుత్వం నుంచి వరి విత్తనాలును కేజీ 5/- సబ్సిడీ పై ఎం టు యు 1121 (శ్రీ ధృతి) విత్తనాలు రైతులకు సరఫరా చేయటం జరువుతున్నది అని చెప్పినారు .. దీని పూర్తి ధర 30 కేజీలు బస్తా 1260 /- సబ్సిడీ 150/- రైతు చెల్లించవసిలింది 1110 /- విత్తనాలు కావలిసిన రైతులు ఆధార్ కార్డ్ తీసుకుని రావలును..అలాగే చెయ్యరు,కందికుప్ప,కాట్రేనికోన గ్రామాల్లో విత్తనాలు రైతులు కు అందుబాటులో ఉన్నాయి అని మండల వ్యవసాయాదికారి వారు తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఏ ఏ లు మనోజ్, దేవేంద్ర మరియు రైతులు విత్తనాల బుజ్జి,జంగా శ్రీను,వాసంశెట్టి రాజేశ్వరరావు, శీలం సూర్యనారాయణ, సంసాని త్రిమూర్తులు, పిల్లి ధర్మారావు మొదలగు రైతులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు…


