జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనిడిమాండ్ చేస్తున్నరాజంపేటలోజరుగుతున్న ప్రజా ఉద్య మానికి సంఘీ భావంగా శనివారం కువైట్ లోని రాజంపేట ప్రాంత తెలుగు ఐక్యంగా సమావేశంనిర్వహించారు
కువైట్లో నివసిస్తున్న రాజంపేట ప్రజలందరూ ఒకతాటిపైకి వచ్చి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిని తెలియ చేశారు,మా ప్రాంత అభివృద్ధి కోసం భవిష్యత్ తరాల వృద్ధి కోసం దశాబ్దాల కల అయిన జిల్లా ఏర్పాటు నెరవేరేందు కు ,రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నా మని,రాజంపేట ప్రాంతంలో జరుగుతున్న ప్రజా ఆందోళన లకుకువైట్ రాజంపేట ప్రజలందరు పూర్తి మద్దతు తెలుపుతున్నాం.మా స్వరం రాజంపేట వరకు చేరే వరకు, మా న్యాయమైన డిమాండ్ నెరవేరే వరకు మా మద్దతు కొనసాగు తుంది. ఈ సంఘీ భావ కార్య క్రమంలో ధరురు బలరాం నాయుడు, ఓలేటి దివాకర్, మాలేపాటి సురేష్ బాబు, మాలేపాటి బాబు, పోలారపు బాబు, ములక రవి, రమేష్ దుగ్గినేని మురళి ,మదిన ఈశ్వర్, వీరబల్లి అంజి రెడ్డయ్య, నాయుడు సుదర్శన్, నాయుడు, మాలార్పు భాస్కర్ కూరపాటి చంద్ర, కూర పాటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు,


