Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 6, శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శాయంపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి మండల నాయకులతో కలిసి పూలమాలను వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బుచ్చి రెడ్డి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి, అసమానతలు లేని సమాజం కోసం అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిదని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిందం రవి బాసని శాంత రేణిగుంట్ల సదయ్య రాజ్ కుమార్ మారెపల్లి కటయ్య వరదరాజు రాజేందర్ వలుపదాసు రాము రమేష్ తదితరులు పాల్గొన్నారు…..