ఉష్కమల్ల విజయలక్ష్మి, పూనమి చందు , (జనం న్యూస్ 6డిసెంబర్ ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం గ్రామంలో స్వతంత్ర అభ్యర్థి అయిన ఉష్కమల్ల విజయలక్ష్మి పున్నమి చంద్ స్థానిక సర్పంచి ఎన్నికల్లో పోటీచేశారు. గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామంలో ప్రతి వాడకు ఏ సమస్య ఉన్న అన్ని విధాలుగా సమస్యలు పరిష్కారానికై అహర్నిశలు కృషి చేస్తానని అదేవిధంగా త్రాగునీరు, డ్రైనేజీలు, లైటింగ్ వంటి అనేక సమస్యలు తమ దృష్టిలో ఉన్నాయని ప్రజలు ఈసారి బీసీ వాదం బలంగా ఉన్నందున బీసీ బిడ్డ అయిన నన్ను ఆశీర్వదించాలని అదేవిధంగా ఆశీర్వదించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని కోరారు.


