జుక్కల్, డిసెంబర్ 06 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సవర్గవ్ గ్రామనికి చెందిన విఠల్ శోభ దంపతుల కుమారుడు ఆర్మీ జవాన్ పవర్ సురేష్ గత నాలుగు నెలలు నుంచి ఆర్మీలో ట్రైనింగ్ పూర్తి చేసుకొని స్వగ్రామానికి వచ్చిన ఆర్మీ జవాన్ కు శనివారం మాజీ సర్పంచ్ పవర్ కిషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మాజీ సర్పంచ్ పవర్ కిషన్ మాట్లాడుతూ… ఒక మారుమూల గ్రామం నుంచి ఆర్మీలో చేరడం నిజంగా గర్వకారణం, ఎందుకంటే ఇది గ్రామీణ యువత దేశభక్తి, క్రమశిక్షణ, ధైర్ర్యానికి నిదర్శనం అన్ని ఇలాంటివారు తమ కుటుంబాలకు, గ్రామానికి, దేశానికి గర్వకారణంగా నిలుస్తూ, ఇతర యువతకు స్ఫూర్తినిస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.


