Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం బీసీ రిజర్వేషన్ ఇవ్వనందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పై సాయి ఈశ్వర చారి పెట్రోల్ పోసుకొని బలిదానం చేసుకున్నాడని, బీసీ జెఎసి రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ కొమురయ్య అన్నారు శాయంపేట మండలంలో చౌరస్తా వద్ద సాయి ఈశ్వర చారి మరణానికి ఫోటోకు ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం లేదని తీన్మార్ మల్లన్న ఆఫీసుకు వచ్చి మాట్లాడి పోయి సాయి ఈశ్వర చారి బీసీలకు రిజర్వేషన్ ఇస్తలేరని మనస్థాపం చెంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తున్నాయి బీసీలకు అన్యాయం చేస్తున్నాయని చెప్పి విమర్శించి పెట్రోల్ పోసుకొని ఆత్మబలిదానం చేసుకున్నాడు హైదరాబాదులో నిమ్స్ హాస్పటల్లో ఈ నెల 5 మరణించినాడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న పరామర్శించారు ఈశ్వర చారి కి ఘనంగా నివాళులర్పించినారు తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయడము రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సిగ్గుచేటు కుట్ర చేసి అరెస్టు చేస్తున్నారు బీసీల తరపున పోరాటం చేసినందుకు అరెస్టు చేయడము బిసి రాజకీయ పార్టీ నాయకులు ఎంపీలు ఎమ్మెల్యేలు సిగ్గు చేటు రాజీనామా చేయండి బీసీ నాయకులపై స్థానిక ఎలక్షన్లో అధికార పార్టీ మంత్రి కోమటిరెడ్డి బిసి అభ్యర్థి సర్పంచిగా పోటీ చేస్తే కిడ్నాప్ చేసి మూత్రం తాగించడం ప్రజా ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు బీసీ ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ గెలిచి బీసీ నాయకులపై బీసీ ప్రజలపై దాడులు చేయడము సిగ్గుచేటు కోమటిరెడ్డి నల్గొండలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బీసీ నాయకునికి ఇస్తే అతని మీద దాడులు చేస్తున్నాడు డాక్టర్ చెరుకు సుధాకర్ ఉద్యమ నాయకుడు మీద దాడులు చేయిస్తున్నాడు ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో సర్పంచి వార్డ్ నెంబర్లపై దాడులు చేస్తున్నారు మంత్రి కోమటిరెడ్డి ని వెంటనే మంత్రి పదవి నుండి సస్పెండ్ చేయాలి లేని పక్షంలో బీసీ నాయకులందరూ స్థానిక ఎలక్షన్లో పోటీ చేసిన నాయకులందరూ బీసీల తరఫున పోరాటం చేయాలి ఇప్పటికైనా బీసీ సంఘాలు బీసీ రాజకీయ పార్టీలు నాయకులు అందరూ ఏకం ఐ పోరాటం చేయాలి స్థానిక ఎలక్షన్లో బీసీలను ఎక్కువ శాతం గెలిపించుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమం లో బీసీ నాయకులు పోలిశెట్టి గణేష్ నాగలాగాని వీరన్న ముంజాల నాగరాజు రాజమహమ్మద్ రమేష్ మాజీ సర్పంచ్ నందం సంజీవరావు ఐలయ్య పురాణం చందర్ ఎల్లయ్య డాన్ తదితరులు పాల్గొన్నారు….