Listen to this article

జనం న్యూస్ 06నవంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం)

అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలి డాక్టర్ ఇన్నయ్య సింగరేణి ఉన్నత పాఠశాల.పి వి కాలనీ నందు ఇంచార్జ్ ప్రదానోపాధ్యాయులు ఎం వేణు అధ్యక్షతన జరిగిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సమావేశంలో సింగరేణి ఏరియా హాస్పిటల్ డాక్టర్ ఇన్నయ్య మాట్లాడుతూ కుల ,మత ,ప్రాంత, లింగ , పేద ధనిక,బేధాలను లేకుండా చేయడంలో డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కృషి అమోఘమని, సమాజంలోని అనేక దురాచారాలు రూపుమాపాలన్న, స్వావలంబన సాధించాలన్న చదువు ఒకటే మార్గం అన్న అంబేద్కర్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం.వేణు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలని, విచక్షణల్ని ఎదుర్కొని, భావి సమాజం బాగుండాలని తలంపుతో , బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాటలువేశారని, అలాంటిమహనీయున్ని స్మరించుకోవడం అంటే వారి అడుగుజాడల్లో నడవడమే నిజమైన నివాళి అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మస్తానయ్య, వెంకన్న,ఎల్ దయానంద్ , స్రవంతి ,మమత ,లలిత, రజియా , సరిత, రజిత, సింధు ప్రియా, సురేష్ ,కృష్ణవేణి, కోటేష్, కిరణ్ మై, సోనీ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు